9 మందికి ఆసుపత్రిలో చేర్చి చికిత్సలు
వ్యాధి లక్షణాలు మరో 25 మందికి
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం విశ్వనాధపురం గ్రామంలో అతిసారం ప్రబలి ఇద్దరు వ్యక్తులు లెంక బంగారమ్మ (75), ఒడిశా వాసి సీతన్న (72) మృతి చెందారు. 9 మంది ఆసుపత్రిలో చేరారు మరో 25 మంది వరకు అతిసార వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారు సాలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్సలు పొందుతున్నారు. మిగిలిన వారికి గ్రామంలోని వైద్య శిబిరం ఏర్పాటు చేసారు. జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో పాచిపెంట మండల పీహెచ్ఈల వైద్యాధికారులు సిబ్బంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. మూడు రోజుల కిందట ఇద్దరికీ అతిసార లక్షణాలు కనిపించగా గురు శుక్రవారాల్లో ప్రబలిందని గ్రామ ప్రజలు చెబుతున్నారు.