విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
ఎచ్చెర్లలో టిడిపి సభ్యత్వ నమోదు పై అవగాహన సదస్సు
ఎచ్చెర్ల లో టీటీడీ కళ్యాణమండపంలో సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగింది. టీడీపీ అధికారం లోకి వచ్చిన తరువాత మొట్టమొదటి సారి తెలుగుదేశం పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం విజయనగరం పార్లమెంట్ సభ్యులు, ఐ.టీ కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు.
సమావేశానికి తెలుగుదేశం నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ ఇంచార్జ్‌లు, యూనిట్ ఇంచార్జ్‌లు, క్లస్టర్ కోఆర్డినేటర్లు, కార్యకర్తలు హాజరయ్యారు. వీరికి
సభ్యత్వ నమోదు ద్వారా పార్టీ గుర్తింపు పొందటం ఎంత ముఖ్యమో ఎంపీ అప్పలనాయుడు వివరించారు. ఈ కార్యక్రమం ప్రతి టీడీపీ కార్యకర్తకు ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని, భవిష్యత్తులో వారిని పార్టీలో మరింత భాగస్వామ్యంగా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆయన ప్రకారం, ఈ సభ్యత్వం ద్వారా ప్రతి కార్యకర్తకు ప్రమాదవశాత్తు ఏదైనా జరగినా, పార్టీ ద్వారా భీమా సదుపాయం కూడా లభిస్తుందని తెలిపారు. అలాగే, మెట్రో నగరాల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబడటం సంతోషకరమని, దాని ద్వారా అక్కడ నివసించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా సభ్యత్వం ద్వారా గుర్తింపు లభించే అవకాశం ఉందని చెప్పారు.
నియోజకవర్గంలో లక్షకు పైగా సభ్యత్వాల నమోదు లక్ష్యం అని ప్రకటించారు. ప్రతి టీడీపీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, నాయకులు, కార్యకర్తలు అవేదన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే వారికి అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. టీడీపీ నాకిచ్చిన ఈ అరుదైన అవకాశం పార్టీ పారదర్శకతకు నిదర్శనమని, పార్టీలో నిస్వార్ధంగా సేవ చేసేవారికి గుర్తింపు వచ్చే విధంగా కేంద్ర కార్యాలయం పనిచేస్తుందని వివరించారు. కార్యక్రమంలో నాలగు మండలాల అధ్యక్షులు ముప్పిడి సురేష్, బెండు మల్లేశ్వరరావు, కుమారపు రవి కుమార్, బాలబొమ్మల వేంకటేశ్వరరావు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.