సాలూరు శ్యామలాంబ ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా అక్యాన అప్పారావును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ముఖ్యమైన వీధుల నుంచి కార్యదర్శులు ఉపాధ్యక్షులు ఎంపిక చేస్తామని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన అప్పారావును మంత్రి సంధ్యారాణి మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్, యువరాజు, పుర పెద్దలు అభినందించారు