వాల్మీకి వేషధారణతో ఆకట్టుకున్న విద్యార్థి
పాచిపెంట మండలం కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాల్మీకి జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు పి నిర్మల, ఉపాధ్యాయులు వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మూడో తరగతి విద్యార్థి దీక్షిత్ వాల్మీకి వేషధారణతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. వాల్మీకి రచించిన రామాయణంలోని విశేషాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.