ఆదాయానికి గండి పెట్టొద్దు అంటూ ఆదేశం
రికార్డులు పరిశీలించిన ఎస్పీ
విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బి. ప్రసాద్ రావు మంగళవారం పాచిపెంట మండలం పి. కోనవలస చెక్ పోస్టును ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ దాటి వెళుతున్న వాహనాలకు సంబంధించిన పత్రాలు సక్రమంగా పరిశీలిస్తున్నారా లేదా చెల్లించాల్సిన మొత్తాన్ని సక్రమంగా తీసుకుంటున్నారా లేదా వంటివి పరిశీలించారు. అక్రమ రవాణాను అడ్డుకోవడమే కాకుండా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తప్పనిసరిగా రప్పించాలని చెక్ పోస్ట్ అధికారులకు ఆదేశించారు. ఆదాయానికి గండి పెడితే చర్యలు తప్పవన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ, అటవీ శాఖ చెక్ పోస్టులను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.