ఉత్తరాంధ్ర భక్తుల కల్పవల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. విజయనగరం మహారాజులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొని ఉత్సవాలను ప్రారంభించారు. అతిథులను విజయనగరం ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు సాదరంగా ఆహ్వానించారు. విజయనగరం ఉత్సవ ర్యాలీ ప్రారంభించి గోడపత్రికలు ఆవిష్కరించారు. బెలూన్స్ ఎగురవేశారు. కార్యక్రమంలో పలుశాఖల అధికారులు, సిబ్బంది కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.