కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు వంశీయుల ఆహ్వానం మేరకు పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాను విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆహ్వాన పత్రికను సోమవారం అందజేశారు.
ఈనెల 13,14,15 తేదీల లో జరగనున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవాలకు వీక్షించేందుకు దేశ విదేశాల నుండి అమ్మవారి భక్తులు వస్తారని, అలాంటి విశిష్టత కలిగిన మహోత్సవాలకు తప్పనిసరిగా రావాలని స్పీకర్ గారిని కోరారు. అలాగే తిరుమల నుండి తీసుకెళ్లిన వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని స్పీకరుకు అందజేశారు.