కొండపేటలో వినాయక 90వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని పూజలు
ఎంపీతో పాల్గొన్న మార్క్ ఫెడ్ ఛైర్మన్, సభ్యులు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో విజయనగరంలో పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైవిబి రాజేంద్ర ప్రసాద్ గారు, ఎపి మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతూ బంగార్రాజు, డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు శ్రీమతి వానపల్లి లక్ష్మి, నాయకులు, సర్పంచ్ లు పాల్గొన్నారు. అలాగే నెల్లిమర్ల నియోజకవర్గం కొండపేట గ్రామంలో వరసిద్ధి వినాయక చవితి 90వ వార్షికోత్సవ సంబరాల్లో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్సీ రఘువర్మ, మార్క్ ఫెఢ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, నెల్లిమర్ల బీజేపీ ఇన్చార్జి బుర్లి శ్రీధర్, నెల్లిమర్ల మండల పార్టీ అధ్యక్షులు కడగల ఆనంద్ , టీడీపీ సీనియర్ నాయకులు సువ్వారి రవి శేఖర్ , టీడీపీ సీనియర్ నాయకులు గేదల రాజారావు, నియోజకవర్గం ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, అభిమానులు. పాల్గొన్నారు.