ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట్ భానోజీ నాయుడును విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అభినందించారు. సర్పంచుల హక్కులు విధులు బాధ్యతలు గుర్తు చేస్తూ గ్రామాల అభివృద్ధికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తామని ఎంపీ అన్నారు. అనంతరం భానోజీ నాయుడును ఎంపీ సత్కరించారు.