జూనియర్ డాక్టర్లకు అన్యాయం జరగకుండా చూస్తామని మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
జీవో 85 రద్దు చేయాలని కోరుతూ ఏరియా ఆసుపత్రిలో పనిచేసే జూనియర్ డాక్టర్లు, వైద్యాధికారులు మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఇన్ సర్వీస్ కోటాను కొనసాగించాలని కోరారు. పీజీ కోర్సులో చేరేందుకు జూనియర్ డాక్టర్లకు ఇన్ సర్వీస్ కోటా కొనసాగించడం వలన రోగులకు మరిన్ని వైద్య సేవలు అందే అవకాశం ఉందని తెలియజేశారు.