పార్వతీపురం మన్యం జిల్లా
సాలూరు పట్టణంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోన రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…
ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి, తినాలి, బ్రతకాలంటే 2024 లో మళ్లీ జగన్ సీఎం అవ్వాలనీ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోన రాజు అన్నారు.
రాష్ట్రంలో అన్ని మైనార్టీ కులాల వారు సంతోషంగా ఉన్నారంటే జగన్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలే కారణం అన్నారు.
చంద్రబాబు దళితుల సంక్షేమాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు.
రాష్ట్రంలో మాలలు అంత సీఎం జగన్ పక్షాన ఉన్నారని మళ్ళీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు గెలుపే లక్ష్యంగా దళితులు పనిచేస్తున్నారని యోనా రాజు ధీమా వ్యక్తం చేశారు.
టిడిపి, బిజెపి, జనసేన లాంటి పార్టీలు ఎన్ని వచ్చినా వైసీపీ గెలుపు తథ్యమని యెన రాజు అన్నారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మామిడి కళాధర్, 25వ వార్డు కౌన్సిలర్ సింగారపు ఈశ్వరరావు పాల్గొన్నారు