గిరిజన సంక్షేమ శాఖ వర్క్ షాప్ లో మంత్రి సంధ్యారాణి
విజయవాడ నాగార్జున యూనివర్శిటీలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దర్తి ఆబ జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ రాష్ట్రస్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసే వర్క్ షాప్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ లో చేపడుతున్న కార్యక్రమాలను, గిరిజన సంక్షేమానికి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తున్న పథకాలు వివరించారు. గత ప్రభుత్వ పాలనలో ఐటీడీఎ లు నిర్వీర్యం అయిపోయాయని, సమస్యలతో వచ్చిన గిరిజనులను నిర్లక్ష్యం చేసారని తెలిపారు. ఇప్పుడు ఐటీడీఎ ల ద్వారా అభివృద్ధి జరుగుతుందని, అన్న కాంటీన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2000 గిరిజన గ్రామాలకు 1200 కోట్ల రూపాయల తో కనెక్టివిటీ రోడ్డులు ముఖ్యమంత్రి మంజూరు చేసారని తెలిపారు. హాస్టల్లో పిల్లలకి కాస్మోటిక్ చార్జీలు, లాండ్రీ మరియు ఆరోగ్య సమస్యలు రాకుండా ఏ.ఎన్.ఎం లు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి ఐటీడీఎ లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర అధికారులు, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.