గాయపడిన హెడ్ కానిస్టేబుల్
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో సోమవారం అర్ధరాత్రి యువకుల మధ్య కొట్లాట జరిగింది. యువకులు మధ్య ఘర్షణను నిలువరించేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ సత్యం నాయుడు గాయపడ్డారు అలాగే మరో ముగ్గురుకి స్వల్ప గాయాలు అయ్యాయి. హెడ్ కానిస్టేబుల్ ను సాలూరు ఏరియా ఆసుపత్రిలో చేర్చి చికిత్సలు అందించారు. కొట్లాటకు దిగిన 40 మందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సిఐ బి. అప్పలనాయుడు తెలిపారు.