సాలూరు మండలం గంగన్నదొర వలసలో భారీ ర్యాలీ
పార్వతిపురం మన్యం జిల్లా
ఎన్నికలలో వైకాపా అత్యధిక ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని మళ్లీ సునామీ సృష్టిస్తుందని అరకు ఎంపీ అభ్యర్థిని డాక్టర్ తనుజారాణి, ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్న దొర అన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గంగన్న దొర వలసలో బుధవారం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్న దొర, ఎంపీ అభ్యర్థితో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం సమావేశం నిర్వహించి ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఏ విధంగా కృషి చేయాలో కార్యకర్తలకు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో మళ్లీ వైకాపా పాలన తీసుకువచ్చేందుకు దోహదపడతాయన్నారు. టిడిపి జనసేన బిజెపి నేతలు జతకట్టి పదవులు దక్కించుకునేందుకు పోరాడుతున్నారన్నారు. వారికి పదవుల పై ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజానీకంపై ఉండదన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి ఏమీ చేయలేదన్నారు. గతంలో పేదలకు అన్ని పథకాలు ఉచితంగా ఇస్తామని చెప్పి ఆల్ ఫ్రీ బాబుగా పేరొందారన్నారు. ఇంటికో ఉద్యోగం, బాబు వస్తే జాబు అంటూ గత ఎన్నికల్లో మోసం చేశారు. ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధపడుతున్నారన్నారు. కూటమి నేతల మాటలు నమ్మి ప్రజలు మోసపోతే సంక్షేమం అభివృద్ధి చేజేతులారా పోగొట్టుకున్న వారు అవుతారన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు