
పదో తరగతి ఫలితాల్లో సాలూరు సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రికార్డ్ స్థాయి విజయం సాధించింది.
అత్యుత్తమ విద్యా విధానంతో ముందుకు వెళ్తున్న సాలూరు పట్టణంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, 2025-26 పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది.
పార్వతిపురం మన్యం జిల్లా
కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఈ పాఠశాల విద్యార్థులు ఫలితాలను సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులందరూ ఉత్తీర్ణులై 100% ఫలితాన్ని సాధించారు.
మొత్తం 21 మంది విద్యార్థులలో, 12 మంది విద్యార్థులు 500 మార్కులు సాధించి పాఠశాల కీర్తిని దశదిశలా చాటారు.
సాలూరు సెయింట్ జోసెఫ్ స్కూల్ సత్తా – టాప్ మార్కులతో మెరిసిన విద్యార్థులు
పీడిక కీర్తిక స్నేహ 587,
ప్రీతి 579,
ఇంద్రాణి 573
21 మంది విద్యార్థుల్లో 12 మంది విద్యార్థులు500 మార్కులకు పైగా సాధించి పాఠశాల కీర్తిని పెంచారు.
విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల అంకితభావం వల్లే ఈ విజయం సాధ్యమైందని పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ సుజాతమ్మ తెలిపారు.
అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేశారు.





