గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారతీరాజా

తమిళ సినీ చరిత్రలో గ్రామీణ కథలకు కొత్త దిశ చూపిన దర్శకుడు…
వెండితెరపై పల్లె అందాలను అద్భుతంగా ఆవిష్కరించిన సినీ దిగ్గజం… దర్శక ఇమయం భారతీరాజా
భారతీరాజా దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకుంది.
మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించారు
1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించిన భారతీరాజా.
1977లో విడుదలైన “16 వయతినిలే” చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి సంచలనం సృష్టించారు.
తమిళ సినిమాల్లో గ్రామీణ జీవన విధానాన్ని సహజత్వంతో చూపించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అందుకే ఆయనను “దర్శక ఇమయం”గా అభిమానులు పిలుస్తారు.
సిగప్పు రోజక్కల్, కిజక్కే పోగుం రైల్, అలైగల్ ఓయ్వతిల్లై, ముదల్ మరియాదై, కరుత్తమ్మ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించారు.
తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాలు రూపొందించిన భారతి రాజా
తన సినిమాల ద్వారా రాధా, రాధికా, రేవతి, కార్తీక్ తదితర పలువురు నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన భారతీరాజా
ఆరు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు, పలు రాష్ట్ర స్థాయి అవార్డులు.
భారతీయ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ ఆయుధ ఎళుత్తు, పాండియా నాడు, తిరుచిత్రంబలం వంటి చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు.
నాలుగు దశాబ్దాలకు పైగా తమిళ సినీ పరిశ్రమలో తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను అలరించిన భారతీరాజా…
భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.





