
రాముడికి ఇష్టమైన నైవేద్యాలు
శ్రీరామ నవమి సందర్భంగా ముఖ్యంగా పానకం నైవేద్యంగా సమర్పిస్తారు. బెల్లం, మిరియాలు, యాలకులతో తయారుచేసే ఈ పానకం శరీరానికి శాంతిని ఇస్తుంది. వడపప్పు, చలిమిడి కూడా ఈ రోజున ముఖ్యమైన నైవేద్యాలు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని విశ్వాసం. అలాగే కందమూలాలు, పండ్లు, పరమాన్నం సమర్పించడం కూడా శుభప్రదంగా భావిస్తారు.
పూజలో ప్రత్యేకత ఏమిటి
ఈ రోజున తులసి దళాలతో సీతారాములను పూజించడం ఎంతో ముఖ్యంగా భావిస్తారు. మల్లె, సంపంగి పూలతో పూజిస్తే కుటుంబంలో శాంతి, సౌఖ్యం పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. ఎర్ర తామర పువ్వులతో పూజిస్తే ధనలాభం కలుగుతుందని నమ్మకం.






