
*ప్రియురాలిని హతమార్చి.. ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టిన నేవీ టెక్నీషియన్!*
*విశాఖలో దారుణం..*
*పోలీసులకు లొంగిపోయిన నిందితుడు..*
*విశాఖపట్నం మార్చి30 టైమ్స్ *
నగరంలోని ఎల్వీ నగర్లో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశంలో ప్రియురాలిని హతమార్చిన ఓ నేవీ టెక్నీషియన్, ఆపై ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
నౌకాదళంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రవీంద్ర (35) అనే వ్యక్తికి మౌనిక (29) అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. రవీంద్ర భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లడంతో, ఆదివారం రాత్రి అతను మౌనికను తన ఫ్లాట్‌కు పిలిపించుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన రవీంద్ర ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలను రూపుమాపే ప్రయత్నంలో భాగంగా మృతదేహాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో భద్రపరిచాడు.
ఘటన జరిగిన తర్వాత భయాందోళనకు గురైన నిందితుడు రవీంద్ర నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన నేరాన్ని అంగీకరిం






